హైద్రాబాద్ అక్టోబర్ 17 (ఈతరం భారతం);వివిధ రంగాలలో సేవలందించిన నిస్నాతులైన వారికి వెల్ ఎడ్యుకేషన్ ఆండ్ పీస్ కౌన్సిల్ అవార్డుల ప్రధానం చేసింది. సోమవారం న్యూడిల్లిలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్షల్ ఆర్ట్స్ లో నూతన మెలుకువలతో అందించిన సేవలకు గాను తెలంగాణ కు చెందిన బి.కళ్యాణ్ గౌడ్ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ గౌడ్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ లో డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉందని అన్నారు.దీనితో నాపై మరింత భాద్యత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం లో సోషల్ వర్కర్ కాశమొల్ల క్రిష్ణ, డా:జి.సాయి యాదవ్ ఉన్నారు.















