ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 28 :భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలలో ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత రెండు రోజులుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం వరదల్లో చిక్కుకున్నవారిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది. ప్రాణ నష్టం జరగకుండా ప్రతి నిమిషం ప్రభుత్వం, అధికార యంత్రాంగం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నది.సిరిసిల్లా జిల్లా నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారి రక్షణ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో ఆ రైతులను సురక్షితంగా రక్షించారు.















