హైదరాబాద్ సెప్టెంబర్ 27 (ఈ తరంభారతం );మూసీ ముంపు ప్రాంతంలో ఇప్ప్రుడు బీజేపీ నేతలు నిద్ర చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ డిమాండ్ చేసారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ గతేడాది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, నిద్ర చేసిన ఇల్లు కూడా ఇవాళ వరద నీటితో నిండి పోయిందిఇప్పుడు బీజేపీ నేతలు అక్కడకు వెళ్లి మూసి నిద్ర చేయాలిమూసీ ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అడ్డుకున్నారుఅనాడు మూసీ ప్రాంతంలో బీజేపీ నేతలు దొంగ నిద్రలు చేసి ప్రజలను మభ్యపెట్టారుఇప్పుడు భారీ వర్షాలకు మూసీ ముంపు ప్రాంతాలు కృష్ణా నగర్, దుర్గా నగర్, అంబేద్కర్ కాలనీలు మొత్తం నీటిలో మునిగిపోయాయిఇండ్లు మొత్తం నీళ్ళతో నిండిపోయాయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు బాధిత ప్రాంతాల్లో ఎక్కడా బీజేపీ నేతలు కనిపించడం లేదుఅనాడు మూసీలో దొంగ నిద్రలు చేసిన కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడా..?రాజకీయ పార్టీ నేతలు, రాజకీయాలను పక్కన పెట్టి, మూసి ముంపు ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిద్దామన్నారు.మూసీ ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గే వరకు రిలీఫ్ క్యాంపులలోనే ఉండాలిమరో రెండు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందిప్రజలంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపు లకు తరలి వెళ్లాలిరిలీఫ్ క్యాంప్ లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారుఎలాంటి సమస్య వున్నా….పోలీస్,జిహెచ్ఎంసి,హైడ్ర,హెచ్ఎండబ్లు, హెల్త్,రెవెన్యు అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.ఇండ్లలో ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని అన్నారు.















