EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రవీంద్ర భారతి బతుకమ్మ  కవి సమ్మేళనంలో పాల్గొన్న కరీంనగర్ కవయిత్రి వసంత

ఈతరం భారతం  హైదరాబాద్ సెప్టెంబరు  24 : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ రవీంద్రభారతిలో బుధవారం రాష్ట్రస్థాయి బతుకమ్మ కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కవి సమ్మేళనానికి కరీంనగర్ జిల్లా నుంచి ఆహ్వానితులుగా ఎంపికై పాల్గొన్న ప్రముఖ కవయిత్రి, రచయిత్రి పత్తెo వసంత బతుకమ్మపై ‘బతుకు సింగిడి’ పేరుతో ప్రతీకాత్మకమైన వర్ణనలతో కవితను చదివి వినిపించారు.

అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ చేతుల మీదుగా వసంత సత్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రస్థాయి బతుకమ్మ కవి సమ్మేళనంలో పాల్గొన్న వసంతకు సహచర కవయిత్రులు, కవులతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top