ఈతరం భారతం/హైదరాబాద్ /అక్టోబర్ 23 :
తెలంగాణ రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ రంగారెడ్డి,హైదరాబాద్ , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల DEO ల మరియు MEO ల సమీక్షా సమావేశం హైదరాబాద్ బేగంపేట్ లోని ది ప్లాజా (తెలంగాణ టూరిజం భవనం)లో నిర్వహించారు .ఈ సమావేశంలో చైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ,కమిషన్ సభ్యులు వచన్ కుమార్, వందన గౌడ్, చందన, బండి అపర్ణ, సరిత, ప్రేమలత అగర్వాల్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్జెడి విజయలక్ష్మి ,అధికారులు సిపిడిఓలు రమణాచారి ,షబానా ,చందనేశ్వరి ,రంగారెడ్డి జిల్లా డీఈఓ సుసింధర్ ,హైదరాబాద్ డీఈఓ రోహిణి , చైల్డ్స్ కమిషన్ నుండి అంబిక , రామకృష్ణ , హసీనా,హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంఈఓ లు పాల్గొన్నారు.హైదరాబాద్, రంగారెడ్డి మరియు మెడ్చల్ జిల్లాల స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంతో సమీక్షా సమావేశానికి సంబందించిన ఈ క్రింది అజెండా అంశాలు చర్చించారు.
విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి:
ప్రభుత్వ పాఠశాలలలో శిక్ష ముఖంగా విద్యార్థి డ్రాప్‌ఔట్ రేటు, (2024-2025 విద్యా సంవత్సరానికి గణాంకాలు), శారీరక శిక్షలకు సంబంధించి నివేదించిన కేసులను ఎలా నిర్వహిస్తున్నారు?ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ: ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు, గుర్తింపు మరియు ఫీజు నియంత్రణకు అధికారం – CBSE, ICSE పాఠశాలలను నియంత్రించేందుకు ఉన్న అధికారుల పాత్ర.అభ్యాస ఫలితాలు: 2024-2025 విద్యా సంవత్సరానికి S.S.C ఫలితాలు – ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో.
ఫిర్యాదుల నిర్వహణ:
బాల్యవివాహాల గణాంకాలు, విద్యా శాఖ తరఫున ట్రాకింగ్ వ్యవస్థ, బాల్యవివాహాలు నిరోధించిన తర్వాత పాఠశాలకు చేరిన పిల్లల విజయ కథలు, 2025 జనవరి నుండి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య. బాలలపై దాడులకు (2024-2025 విద్యా సంవత్సరంలో నమోదైన కేసులు), ఈ సమస్యలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు (బాలల చట్టాల గురించి – గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, BBBP, ‘గర్ల్ చైల్డ్ డే’ నిర్వహణ తదితర అంశాలు).
బెస్ట్ అవైలబుల్ స్కూలింగ్ స్కీమ్ SOP:
ఇటీవల తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుతున్న 25,000 SC/ST విద్యార్థులను Best Available Schooling Scheme ఆద్వర్యంలో ప్రభుత్వం పెండింగ్ బకాయిల కారణంగా తరగతుల నుండి తొలగించారు. DY CM కలెక్టర్లు, DEOలు, వెల్ఫేర్ అధికారులను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, స్కీంలో ఎంపికైన అభ్యర్థుల విద్య కొనసాగిస్తారని హామీ.
ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్:
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూలుల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చేరదీసారా? ఎటువంటి దివ్యాంగతలు/పిల్లల సంఖ్య గణాంకాలు.
SMC/చైల్డ్ హెల్ప్‌లైన్:
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఏర్పాటైంది లేదా? ప్రతి మండల/జిల్లాలో బాలికల అక్షరాస్యత శాతం, 2024-2025 విద్యా సంవత్సరానికి గణాంకాలు.
వసతుల అందుబాటు:
పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేసిన నిధులు, వినియోగం, విద్యార్థుల సంఖ్యతో పోల్చినప్పుడు మరుగుదొడ్ల లభ్యత, శుభ్రమైన తాగు నీటి వినియోగం, సానిటేషన్, సరిహద్దు గోడలు, మంచి వెంటిలేషన్ వంటి అంశాలు.
మిడ్ డే మిల్స్ స్కీమ్:
ప్రతి జిల్లాలో మిడ్డే మిల్స్ ఏజెన్సీలు, ఆహార విషప్చారం కేసులు, భోజనాల నాణ్యత నిర్వహణకు తీసుకున్న చర్యలు.
పాఠశాల ఆరోగ్య కార్యక్రమం:
పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఆరోగ్య శిబిరాలు, మొత్తం ఆరోగ్య పరిశీలనలు, కంటి పరీక్షలు, టీకా కార్యక్రమం.
25% కోటా అమలు:
ప్రైవేట్ పాఠశాలల్లో స్థానిక పిల్లలకు 25 శాతం కోటా అమలు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్థితిగతులు.
కెరీర్ మార్గదర్శకం:
పాఠశాలల్లో వృత్తిపరమైన శిక్షణలు, సలహా వ్యవస్థలు, పెద్దదశ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ.
బాల్ భవన్ల స్థితి:
14 నవంబర్ బాలల దినోత్సవాన జవహర్ బాల్ భవన్లో పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రాధమిక, ప్రైవేట్ స్కూల్ లైబ్రరీ స్థితి, వారానికి కేటాయించిన తరగతుల సంఖ్య, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల లభ్యత.
వలస కార్మిక పిల్లల నమోదు:
నిర్మాణ ప్రాంతాలు, పరిశ్రమ ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లలు, బ్రిక్కిలిన్ వర్కర్స్ పిల్లల్లో కొంతమందికి ఆధార్ కార్డు లేక ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం సమస్యలు, పిల్లల నమోదు కొరకు తీసుకున్న చర్యలు.
పెండింగ్ ATRలు:
స్కూల్ ఎడ్యుకేషన్ శాఖలో మూడు జిల్లాల నుంచి కమిషన్‌కు పెం
డింగ్‌లో ఉన్న ATRలను పరిశీలిస్తారు.















