హైదరాబాద్ అక్టోబర్ 13 (ఈతరం భారతం);బంగారం ధరలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పుత్తడి ధర తాజాగా మళ్లీ పెరిగింది. తులం బంగారం రూ.1.30 లక్షలకు చేరువైంది. బంగారంతోపాటూ వెండి కూడా ఆకాశాన్ని తాకుతోంది. ఏకంగా రూ.2లక్షలకు చేరువైంది.















