EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వరదసాయం కింద పలు జిల్లాలకు రూ.200 కోట్లు నిధులు మంజూరు

హైదరాబాద్ సెప్టెంబర్ 3 (ఈ తరం భారతం );ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని ప్రధాన రహదారులు, భవనాలు, చెరువులు, కుంటలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదసాయం కింద పలు జిల్లాలకు రూ.200 కోట్లు నిధులను మంజూరు చేసింది. భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన 7 జిల్లాలకు గాను రూ.10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన 26 జిల్లాలకు రూ.5 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణా రావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని, పరిహారాలను వెంటనే విడుదల చేయాలని వారికి సూచించారు. భవిష్యత్‌లో రాబోయే అకాల వర్షాలు, వరదలతో తరచూ సంభవించే ప్రమాదమున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా

రు.

 

Related News

Select the Topic
Scroll to Top