EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేటీఆర్‌పై ఏసీబీ 75 పేజీల ఛార్జిషీట్

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 6

ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ 75 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై రూ.600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఆరోపించింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్‌లను నిందితులుగా చేర్చింది. క్యాబినెట్, ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఏసీబీ పేర్కొంది. ప్రమోటర్ సంస్థ అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని, దానికి ప్రతిఫలంగా రేసింగ్ బాధ్యతలు అప్పగించారనే క్విడ్ ప్రో కో కోణాన్ని ఏసీబీ ప్రస్తావించింది. హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ.46.82 కోట్లు చెల్లించారని, కేటీఆర్‌పై ఐపీసీ 409, 120బీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది.

 

Related News

Select the Topic
Scroll to Top