EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సచివాలయంలో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 6 :

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సచివాలయ ప్రాంగణంలోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.

మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతరాజుల నృత్యాలు, మంగళ వాయిద్యాల నడుమ సచివాలయం ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ సందర్భంగా సచివాలయ సంఘ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బోనాల పండుగ రాష్ట్ర ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top