ఈతరం భారతం అక్టోబర్ 17 : హైదరాబాద్ : లవ్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి వేమన పద్యాల పోటీలలో వివిధ రాష్ట్రాల నుండి కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు 784 మంది ఇటీవల పాల్గొన్నారు.
ఈ
పోటీలో మేడ్చల్ ఒక్లీ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయిని దామర్ల నాగమణి ఉత్తమ ప్రదర్శన కనపరచడంతో తృతీయ స్థానం పొంది బహుమతి గెలుపొందిన సందర్బంగా ఆమెను జ్ఞాపిక,ప్రశంసా పత్రం,శాలువాతో శుక్రవారం ఘనంగా సన్మానించారు. లవ్ పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ నాగమణికి తమ సంస్థ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.బహుమతి గ్రహీత దామర్ల నాగమణి మాట్లాడుతూ ఎంతోమంది పాల్గొన్న జాతీయ స్థాయి వేమన పద్యాల పోటీలలో తనకు బహుమతి లభించడం ప్రత్యేక గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శిరీష,ఉపాధ్యాయులు మాధురి, సబ, చందన, విశాలాక్షి, ప్రసన్న, ద్వారక, భాగ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
.















