ఈతరం భారతం హైద్రాబాద్ జులై 3:
సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి ‘నాగబంధం’ సినిమా ఎంతో దోహద పడుతుందని లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ చెర్మెన్ జస్మాత్ పటేల్ అన్నారు.సనాతన ధర్మ సందేశంతో ‘నాగబంధం’విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన డివైన్ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఈ నెల 3న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులముందుకురానున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ సందర్బంగా జస్మాత్ పటేల్ మాట్లాడుతూమన భారతీయ సంస్కృతి, మూలాలను ఆవిష్కరించే గొప్ప కథ ఇదని, ప్రజలకు సనాత ధర్మ సందేశాన్ని అందిస్తుందని అన్నారు. పద్మనాభ స్వామి ఆలయం తాలూకు సెట్ ప్రేక్షకులను భక్తిప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆయన చెప్పారు.ఈ సందర్బంగానాగబంధం సినిమా నిర్మాత సినిమాలోని నటీనటులను లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.ఈ కార్యకర్సమం లో నిషితా నాగారెడ్డి, నటుడు విరాట్ కర్ణ మరియు నటి నభా నటేష్‌లకు లవ్ ఫర్ కౌ జ్ఞాపికను జస్మ్తా పటేల్, ఎబి చైతన్య దాస్ స్వామి మహేష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.















