EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఈతరం భారతం/హైదరాబాద్/ నవంబర్ 10:

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. . సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఉంటాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు వేగంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నడుస్తున్న రైళ్లు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాల్సి వస్తోందని అన్నారు రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నిత్యం 1.97 లక్షల ప్రయాణికులు వస్తుంటారని తెలియజేశారు. శంషాబాద్ విమానాశ్రయం వలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలనేది తన ఆంకాంక్ష అని.. రైల్వేస్టేషన్ కోసమే ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, 5 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 1.65 లక్షల చ.మీ. మేర కొత్తగా నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్ లోపు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top