ఈ తరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 29. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు లో గల సూరజ్ నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి.
సాయంత్రం 6 గంటలకె పలు వార్డులకు చెందిన మహిళలు తమ తమ బతుకమ్మలతో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేదికకు చేరుకున్నారు అనంతరం బతుకమ్మ ఆడారు .కాలనీ ప్రెసిడెంట్ రవిచంద్ర నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి .ఈ కార్యక్రమంలో కాలనీ మహిళా నాయకురాలు సంతోష్ రెడ్డి తో పాటు కాలనీ చైర్మన్ డాక్టర్ మహేశుని లక్ష్మయ్య నేత ,కాలనీ ప్రెసిడెంట్ రవిచంద్ర కాలనీ కార్యవర్గ సభ్యులు కపిల్, జగదీష్, దేవేందర్, మండల్ రవీందర్ తదితరులు పాల్గొని వేడుకలను పర్యవేక్షించారు.కాగా కాలనీ లోని 13 వార్డులకు గాను పలు వార్డులో ఎక్కడి కక్కడే బతుకమ్మ ఆటలు ఆడి తమ భక్తిని చాటుకున్నారు.















