ఈతరంభారం హైదరాబాద్ సెప్టెంబర్ 13 : సికింద్రాబాద్: బీటెక్, బిఎస్సి సైన్స్ తో పట్టభద్రులైన వారు కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న పీజీ సామాజిక శాస్త్రాల కోర్సులలో అడ్మిషన్లు పొందవచ్చని యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు చెప్పారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ లోని పీజీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ లో పీజీ కోర్సుల అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్ ను ఆయన శనివారం ఆవిష్కరించారు. బీటెక్, బిఎస్సి సైన్స్ పూర్తి చేసిన వారు అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ కోర్సులైన ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ,ఇంగ్లీష్ ఎకనామిక్స్,సోషియాలజీ,జర్నలిజం లలో అడ్మిషన్లు పొందవచ్చని అన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని బీటెక్, బీఎస్సీ సైన్స్ పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2025- 26 విద్యా సంవత్సరానికి సెప్టెంబర్ 26వ తేదీ వరకు అడ్మిషన్ల గడువును పెంచినట్టు ఆయన చెప్పారు. పీజీ అడ్మిషన్లు పొందగోరే అభ్యర్థులు సికింద్రాబాద్ పీజీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ను సంప్రదించాలని అన్నారు. అదేవిధంగా ఇంకా ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ఎంకాం, బిఎల్ఎస్సి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా పీజీ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 7382929623, 8686115491 నెంబర్లను సంప్రదించవచ్చని చెప్పారు. అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా అందుతున్న విద్యా అవకాశాలను ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గంగాధర్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రవి, స్టడీ సెంటర్ సిబ్బంది బి కాంచన, పడాల సతీష్, ఎస్ విజయలక్ష్మి, ఆర్ కె దాసు తో పాటు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.















