హైద్రాబాద్ సెప్టెంబర్.18(ఈతరం భారతం) గ్రూప్స్ 1 మెయిన్స్ పత్రాలను మళ్లీ పునః పరిశీలించాలని ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని..తెలుగు రాష్ట్రాల యువ నాయకుల అధ్యక్షులు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబెర్ కాలపురెడ్డి సాయిబాబా తెలిపారు.గురువారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ జీవో నెంబర్ 29 తో ఓపెన్ క్యాటగిరిని తీసుకువచ్చి షార్ట్ ఫాట్ అనే దాంతో బడుగు బలహీన వర్గాల అవకాశాలను దోచుకుంటున్నారని విమర్శించారు. రైట్ ఆఫ్ ఈ క్వాలిటీ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే విధంగా ఉందని దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పునః పరిశీలించాలని ఇచ్చిన అంశాన్ని సరిగ్గా నిర్వర్తించాలని దానికి టర్మ్స్ అండ్ కండిషన్ హైకోర్టు సూచించాలని విజ్ఞప్తి చేసారు. గతంలోనే రీకౌంటింగ్ పెడితే పెట్టిన విద్యార్థికి మార్కులు అలా ఉండకుండా తగ్గాయని దాంతో నిరూపితమైతుందని వాళ్ల మూల్యాంకనం సరిగ్గా లేదని మరియు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కానుక మళ్ళీ దానికి అప్పజెప్పితే మూల్యాంకనాన్ని సరిగ్గా చేయలేదని ప్రతిపక్షాల పట్ల విమర్శను వెలువెత్తుతాయని దురుద్దేశంతో ఇవన్నీ చేస్తుందన్నారు. తెలుగు లో చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ దీనిపై సరైన విచారణ జరుపుతుందని నమ్మకం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మళ్లీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఉత్తర్వులు ఇవ్వాలని సాయిబాబా కోరారు. ఈ సమావేశంలో విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శి కౌశిక్, తెలంగాణ రాష్ట్ర యువత వంశీ, రామచంద్ర, రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.















