EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు ఘన స్వాగతం

హైదరాబాద్ సెప్టెంబర్ 30 (ఈతరం భారతం);ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం తెలిపింది.ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు, ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ క్రీడాశాఖ తరఫున తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి , ఎండి సోనీ బాలాదేవి  తిలక్ వర్మను సత్కరించారు.పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి, తెలంగాణకే కాకుండా దేశానికి కీర్తి తెచ్చిన తిలక్ వర్మను శివసేనారెడ్డి  అభినందించారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించిన తిలక్ వర్మ ప్రదర్శన యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  ప్రత్యేక అభినందనలు తెలియజేశారని శివసేనారెడ్డి గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ, పోలీస్ శాఖ, ప్రోటోకాల్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top