హైదరాబాద్ అక్టోబర్ 14 (ఈతరం భారతం): హైదరాబాద్ జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.15 వ తేది బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నామినేషన్ స్వీకరణ అదీ తేది పరిశీలన ,ఉపసంహరణ, అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదల కానుంది. 30వ తేది ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుపనున్నట్లు ఎన్నికల అధికారి టి. రాజశేఖర్ తెలిపారు.తేది 15.10.2025 బుధవారం రోజున ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నామినేషన్ పత్రాలు ఇచ్చుట,నామినేషన్ స్వీకరణ: తేదీ 15.10.2025 బుధవారం రోజున ఉదయం 11గంటల నుండి 11.30 గంటల వరకు, నామినేషన్ల పరిశీలన: తేదీ 15.10.2025 బుధవారం రోజున ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, నామినేషన్ల ఉపసంహరణ : తేదీ 15.10.2025 బుధవారం రోజున ఉదయం 12 గంటల నుండి 12.30 గంటల వరకు తదుపరి అభ్యర్థుల ఫైనల్ జాబితా,పోలింగ్ తేదీ : 30.10.2025 ఉదయం10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగనుంది.పై అన్ని కార్యక్రమాలు ఎస్విఎం గ్రాండ్ , రామంతపూర్ హైదరాబాద్ నందు నిర్వహించంన్ ఉన్నారు.
ఎన్నికల నియమావళి:
1. హైదరాబాద్ జిల్లా కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,కోశాధికారి పదవులకు ఎన్నికలు నిర్వహించబడును
2. నామినేషన్ వేసే అభ్యర్థులు హైదరాబాద్ జిల్లాలో డ్రగ్ లైసెన్స్ (Form 20,21, Form 20B,21B ఏదైనా) ఉండి ప్రోప్రైటర్ గా గాని పార్టనర్ గా గాని పేరు కలిగి ఉండవలెను. 36 నెలలు పూర్తి కావలయును. ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకొని ఉండవలెను. డ్రగ్ లైసెన్స్ వ్యాలిడిటీలో ఉండవలెను. ఒక అభ్యర్థి పేరున ఏదైనా ఒక పోస్ట్ మాత్రమే నామినేషన్ స్వీకరించబడును.
3. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి పదవులకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పేపర్స్ కొరకు రూ. 1000/- నామినేషన్ ఫీజుగా చెల్లించి రసీదు పొంది నామినేషన్ పేపర్స్ తీసుకొనవలెను. ఇట్టి నామినేషన్ ఫీజు తిరిగి ఇవ్వబడదు.
4. నామినేషన్ పేపర్స్ పొందే అభ్యర్థులు పైన పేర్కొన్న నియమ నిబంధనలు మరియు జిల్లా అసోసియేషన్ తీర్మాన నిబంధనలు పాటించవలెను. నిబంధనలు పాటించిన అభ్యర్థులకు మాత్రమే నామినేషన్ పత్రాలు ఇవ్వబడును మరియు స్వీకరించబడును
5. ఎన్నికల అధికారి మరియు నామినేషన్ స్వీకరించువారు టి. రాజశేఖర్ గారు, సెల్: 9177771832 మరియు వీరి సిబ్బంది, టీటీసీడీఏ పరిశీలకులు గా వ్యవహరిస్తారు.















