EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్ లో అద్దె ఇళ్ల బాత్రూమ్ లలో కెమెరా పెట్టి… రికార్డు

హైదరాబాద్ అక్టోబర్ 17 (ఈతరం భారతం):: అద్దెకు వచ్చిన వారి బాత్రూమ్ లోని బల్బ్ హోల్డర్‌లో యజమాని సీక్రెట్ కెమెరా పెట్టి వీడియో రికార్డు చేసిన సంఘటన హైదరాబాద్ లోని అమీర్ పేట వెంగళ్ రావు నగర్ లో జరిగింది. అద్దెదారులు ఫిర్యాదు మేరకు ఇంటి యజమానితో పాటు ఎలక్ట్రీషియన్‌పై కేసు నమోదు చేసి ఒకరిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జవహర్ నగర్‌లోని అశోక్ యాదవ్‌కు చెందిన ఇంటిని దంపతులు అద్దె తీసుకొని ఉంటున్నారు. భార్యభర్తలు ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈ నెల 4న బాత్రూమ్‌లోని విద్యుత్ బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు వివాహిత చెప్పింది. అతను ఎలక్ట్రీషియన్ ద్వారా బల్బ్ రిపేర్ చేయించాడు. ఈ నెల 13న బాత్రూమ్‌లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోవడంతో ఆమె భర్త గమనించి దానిని పరిశీలించాడు. అయితే లోపల లైట్ వేసి చూసినప్పుడు, హోల్డర్ లోపల కెమెరా ఉందని అతడు గుర్తించాడు. కంగుతిని అతడు వెంటనే ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు భర్త చెప్పాడు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top