EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కవయిత్రి, రచయిత్రి  పత్తెo వసంతకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు….

ఈతరం భారతం  కరీంనగర్  సెప్టెంబర్ 11 : జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో గురుపూజోత్సవం సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పత్తెo వసంత ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం – 2025 ను అందుకున్నారు. మండల విద్యాధికారి శ్రీనివాస్, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులైన పడాల కిరణ్ జ్యోతి, మధులత చేతుల మీదుగా వసంత ఈ అవార్డును స్వీకరించారు. అవార్డు అందుకున్న వసంతకు పలువురు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గతంలోని అనేక ప్రముఖ పురస్కారాలు, సత్కారాలను వివిధ సంస్థల నుండి తెలుగు సాహిత్య రంగంలో కృషికి గాను ఆమె అందుకున్నారు. మూడు కవితా సంపుటులను ఆమె రచించారు. తెలుగు బోధనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవమున్న వసంత రచనలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి.

Related News

Select the Topic
Scroll to Top