ఈతరంభారతం/హైదరాబాద్ /అక్టోబర్.22 :
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురికి డిగ్రీ కాలేజ్ ని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నియోజక వర్గానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయడం పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం ప్రకటించారు. డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఆదేశాలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి విజయ్ కుమార్ పిఆర్వో అమృత్ తదితరులు పాల్గొన్నారు.















