ఈతరం భారతం సెప్టెంబర్ 1 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం:
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పోలీస్ ఫ్యామిలీ క్వార్టర్స్ లో పోలీస్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసుకున్న అన్నదాన కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ప్రారంభించారు. ముందుగా పోలీస్ కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న గణేష్ మండపంలోని స్వామి వారని దర్శించిన పోలీస్ అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ పోలీసు సిబ్బందికి, పోలీస్ కుటుంబాలకు భోజనాలు వడ్డించారు.కార్యక్రమంలో అడిషనల్ AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, టౌన్ ఏసీపీ రమణమూర్తి, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఎస్బి ఏసీపీ మహేష్, AR ఏసిపీ సుశీల్ సింగ్, సిఐ లు రాజిరెడ్డి, కరుణాకర్, రామకృష్ణ, RI లు కామరాజు, శ్రీశైలం, సాంబశివరావు, సురేష్ పాల్గొన్నారు.















