30.08.2025 ఈతరం భారతం పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు,శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని పోలీస్ కమీషనర్ కొనియాడారు. విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ విరమణ పొందిన వారు
1) Sd. ఇబ్రహీం, SI CSB, ఖమ్మం.
2) M. వెంకన్న, SI VR ఖమ్మం.
3) ఎన్.వెంకట్ రెడ్డి, ASI ఖమ్మం(U).
4) M. సంగయ్య, ARSI (AR)
5) జి.శ్రీనివాసరావు,ARSI, (AR).
6) V. మాధవ రెడ్డి,HC అర్బన్ P.S
ఈ కార్యక్రమంలో ఎస్బి ఏసీపీ మహేష్, AR ACP సుశీల్ సింగ్, RI కామరాజు, సురేష్, పోలీస్ అసోసియేషన్ ఇంచార్జి అధ్యక్షుడు వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.















