EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఏన్కూర్‌లో పోలీసులు శ్రమదానం.. ఎస్సై సంధ్య చొరవ ప్రశంసనీయం

ఈతరం భారతం అక్టోబర్ 14 ఖమ్మం :ఏన్కూర్ : రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏన్కూరు ఎస్ ఐ సంధ్య ఆధ్వర్యంలో తల్లాడ నుండి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై మోకాలు లోతు ఉన్న గుంతల మొత్తం ఏన్కూర్ పోలీసులు శ్రమదానంకు పూడ్చివేశారు.ఎవరో వస్తారు ఏదో చేస్తారని అనుకోకుండా గుంతల పూడ్చివేతకు పోలీసుల శ్రీకారం చుట్టడంతో రోడ్లపై వాహనాల్లో ప్రయాణికులు పోలీసులు చేస్తున్న శ్రమదానానికి హర్షం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఈ లాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రజల నుండి ప్రయాణికుల నుండి హర్షం వ్యక్తుమయ్యాయి.సుమారు మూడు కిలోమీటర్ల మేరకు ఉన్న గుంతలను పూడ్చివేయడంతో ప్రయాణానికి వాహనదారులకు సులభతరమైంది. ఎస్ఐ సంధ్య చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమానికి ప్రజలను మంచి స్పందన వచ్చింది.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, శ్రీహరి, రాజేందర్, శంకరు, రవి, రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top