EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జర్నలిస్టు పెద్దలు తక్షణమే స్పందించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

 

30.08.2025 ఈతరం భారతం రీజనల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ ఖమ్మం.

ఖమ్మం జర్నలిస్టులకు 23.02 ఎకరాల ఇళ్ల స్థలాలను ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం పొంది, జీవో జారీ చేసి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అప్పగించలేదు. అనేక అడ్డంకులు సృష్టిస్తూ జర్నలిస్టుల స్థలాలను సైతం ఇతరులకు కట్టబెట్టే వ్యవహారాన్ని తక్షణమే విరమించుకోవాలని, జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు వేసిన ఫెన్సింగ్ ను, నాటిన మొక్కలను తొలగించాలని , కాలయాపన చేయకుండా జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు అందివ్వాలని కోరుతూ శనివారం జర్నలిస్టులు SR గార్డెన్ సమీపంలోని ఎన్ఎస్ పి కాల్వ కట్టపై జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను జర్నలిస్టుల బృందం పరిశీలించింది.

అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా గ్రావెల్స్ ను దోచుకుపోతున్న ప్రాంతాలను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరింత కాలయాపన చేస్తే జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలు ఇతరులకు కేటాయించే ప్రమాదం లేకపోలేదని జర్నలిస్టు పెద్దలు తక్షణమే స్పందించి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top