ఈ తరం భారతం ఖమ్మం సెప్టెంబర్ 8 :నేలకొండపల్లి మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల ప్రస్తుతం మున్నేరు నది పక్కన జలగం నగర్ లో కొనసాగుతుండగా వరదలకు బిల్డింగ్ శిథిలావస్థలో చేరగా మైనారిటీ గురుకుల పాఠశాలను ఆరెంపుల నందుగల మహమ్మదీయ క్యాంపస్ కు తరలించారు. రేపటినుండి పాఠశాల పున:ప్రారంభం అవుతుందని తరగతులు కూడా ప్రారంభిస్తున్నామని అట్టి విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు గమనించి రేపటినుండి పాఠశాలకు విద్యార్థులను తీసుకొని రావాలని 5 నుంచి 9వ తరగతుల వరకు ఖాళీగా(అన్ని కేటగిరిలలో )ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నామని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కూడా ఎంఈసి సిఇసి గ్రూపులలో ప్రవేశాలు కల్పిస్తున్నామని ఈ సదావకాశాన్ని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వినియోగించుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ బి.రాంబాబు ఓ ప్రకటనలో తెలియజేశారు.వివరాలకు ఈ క్రింది నెంబర్ 8328082806 ను సంప్రదించాలన్నారు.















