ఈతరం భారతం స్తంభాద్రి (ఖమ్మం) సెప్టెంబర్ 9 :
కూసుమంచి : పాలేరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ఉచితంగా షూస్ పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీకారం చుట్టింది.మంగళవారం కూసుమంచి మండలం నరసింహులగూడెంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా 1 నుంచి 5వ తరగతి చదువుతున్న బాలబాలికలకు షూస్ అందజేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ నిర్వహించారు. కూసుమంచి మండలంలోని 62 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1700 జతల షూస్ పంపిణీ చేశారు. కొత్త షూస్ అందుకున్న చిన్నారులు ఆనందంతో కళకళలాడారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ… “ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎల్లప్పుడూ పేదల అంటే మక్కువ చూపే నాయకుడు. ఆయన సూచనల మేరకు పీఎస్ఆర్ ట్రస్ట్ తీసుకుంటున్న ఈ తరహా చర్యలు చిన్నారుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయి. ఒక చిన్న అవసరాన్ని తీర్చడం ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచడం మంత్రి ప్రత్యేకత”. తల్లిదండ్రులకు వ్యయ భారాన్ని తగ్గించడంలో, చిన్నారులకు సౌకర్యం కల్పించడంలో పెద్ద సహాయం. ఇలాంటి సేవా చర్యలు మరిన్ని జరగాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు.















