ఈతరం భారతం/ఖమ్మం/అక్టోబర్ 27 :
నగరంలో వివిధ ప్రాంతాల్లో పూలు అమ్ముకొనే వారికి ఖమ్మం టౌన్ ఫ్లవర్ మర్చంట్ యూనియన్ స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం ఏరియాలో యూనియన్ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం టౌన్ ఫ్లవర్ మర్చంట్ యూనియన్ గౌరవ సలహాదారులు షేక్ మహమూద్, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ మోయిన్, షేక్. ఖాజా మాట్లాడుతూ. ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాల్లో సుమారు మూడు వందల మంది రకరకాల పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారానికి ప్లవర్ మర్చంట్ యూనియన్ ఆఫీస్ మరియు యూనియన్ సభ్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యలయం యూనియన్ గౌరవ సలహాదారులు షేక్ మహమూద్ చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీను, షేక్ సర్దార్, ఉపాధ్యక్షులు ఎం రామకృష్ణ, సహాయ కార్యదర్శి ఆర్ వెంకన్న, కోశాధికారి షేక్ శభాష్ అహ్మద్ కన్వీనర్ మహమ్మద్ ముజాహిద్, కో కన్వీనర్ డి సురేందర్ సిపిఐ 44వ డివిజన్ కార్యదర్శి యూనియన్ ఇంచార్జ్ డుంగ్రోతు శేఖర్ నాయక్, షేక్ ఇస్మాయిల్, శివ, షేక్ . రంజాన్ ఆలీ, షేక్. మహిబూబ్,జానీ, మరియు కమిటీ సభ్యులు కృష్ణవేణి, లాల్ బి, ముంతాజ్, రజిత పాల్గొన్నారు.















