ఈతరం భారతం/ఖమ్మం/అక్టోబర్ 30 :
తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా సహా అనేక ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో నిలువ నీరు చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయదారులను ఆదుకునే చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర రవాణా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి రైతు వెన్నుపోటుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. పంటలు దెబ్బతిన్న వారికి ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందజేస్తాం అని భరోసా ఇచ్చారు.















