EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై జలసౌధలో సమావేశం : హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

ఈతరం భారతం నీలగిరి సెప్టెంబర్ 9 :

ఉమ్మడి నల్గొండ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై జలసౌధలో సమావేశం.హాజరైన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి కామెంట్స్…..

రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం మనకు సానుకూలంశం.

పెండింగ్ ప్రాజెక్ట్ లు అన్ని స్పీడప్ అవుతున్నాయి.

నేను 2005 లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పించి SLBC సొరంగానికి శ్రీకారం చుట్టాం

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్

SLBC పూర్తి అయితే కృష్ణాలో అలకేటెడ్ నీటిని

గ్రావిటీ ద్వారా తెచ్చుకోవచ్చు..

కేవలం రాజకీయ దురుద్దేశంతో పదేళ్లు పక్కన పెట్టారు..

2027 నాటికి SLBC పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి,ఇరిగేషన్ మంత్రి చెప్పడం సంతోషం..

సాగర్ బ్యాక్ వాటర్ చాలా విలువైనవి.. వాటిని చివరి వరకు అందేలా లైనింగ్ కోసం టెండరింగ్ చేసినందుకు ఇరిగేషన్ మంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు

నార్కట్ పల్లి మండలం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒకటి..

అందుకే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ చేపట్టాం.. రిటైర్డ్ ఇంజనీర్లతో పలుమార్లు స్వయంగా చర్చించి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుకున్నాం

రిజర్వాయర్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రారంభించుకున్నాం..

ఉదయ సముద్రం డ్రింకింగ్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తూ..బ్రాహ్మణ వెల్లెంల కు రెగ్యులర్ గా వాటర్ పంపింగ్ చేయాలి..

రాష్ట్ర మంతా వర్షాలు పడ్డా..నల్గొండ జిల్లాలో కట్టంగూరు,మునుగోడు,నార్కట్ పల్లి లో వర్షాలు అతి తక్కువ పడ్డాయి.

ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కు ప్రాబ్లం ఉంది. పంటకు సాగునీటి కోసం చూస్తున్నారు రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది…పంపులు రెడీగా ఉన్నాయి..అధికారులకు ప్రతిసారి చెప్పాలా..? వాటర్ పంపింగ్ చేసి రిజర్వాయర్ ద్వారా సాగు నీరు అందించే ఏర్పాట్లు చేయాలి.అంతేగాక..అప్రోచ్ కెనాల్స్ పూర్తి చేసి దిగువన చెరువులు నింపాలనే ప్రయత్నం చేస్తున్నాం..

ఇప్పటికే కొత్త ఆయకట్టు సృష్టించాం.అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేసిన..ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటి వరకు రివైజ్డ్ టెండర్లు వేయలేదు.

రైతులకు సాగునీరు అందించాలని పైపు లైన్ కోసం నా సొంతంగా 30లక్షలు ఖర్చు చేశాను.

300 కోట్లు బ్రహ్మణ వెల్లెంల కోసం కేటాయించాలని కోరుతున్న

10 శాతం నిధులు..సుమారు 3వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అవుతాయి.

Related News

Select the Topic
Scroll to Top