EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మంచి కర్మలే మంచి ఫలితాలను ఇస్తాయి-      న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ 

సంగారెడ్డి సెప్టెంబర్ 3 (ఈ తరం భారతం ): సెప్టెంబర్ 16 రోజు నుండి 22 వరకు తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ధ్యాన మహా యజ్ఞాలు నిర్వహించబడతాయని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమాలకు ప్రత్యేక ఆహ్వానం పి ఎస్ ఎస్ యమ్ ఛానల్ డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ విచ్చేస్తున్నట్లు తెలిపారు. ధ్యాన ఈ సందర్బంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం లో సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మెగా పిరమిడ్ ఆవశ్యకత గురించి, ధ్యానం యొక్క విలువల గురించి మహా యజ్ఞమే, ప్రపంచ శాంతికి మార్గమని తెలియజేశారు, ఇట్టి మార్గాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ అనుసరిస్తే అంతా ధ్యానమయం శాంతి మయం జరుగుతుందని తెలియజేశారు . కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సదాశివపేట పట్టణం, సిద్ధాపూర్ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధనలో భాగంగా ఏర్పాటు చేసే మెగా పిరమిడ్ క్షేత్రం అక్షరధామ్ లోని స్వామి నారాయణ దేవస్థాన ఆకృతిలో నిర్మాణం 108 కోట్లతో జరుపబడుతుందని, ఇందుకు తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లక్షమంది జన సమీకరణతో త్వరలో పనులు ప్రారంభం జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ఇట్టి క్షేత్రం యొక్క విలువను తెలుసుకునేందుకు అదేవిధంగా తిరుపతిలో జరగబోయే కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ పేరుపేరునా పాల్గొనాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్, వికారాబాద్ కాంటెస్ట్ ఎమ్మెల్యే రామ్ రాజ్, నర్సాపూర్ లక్ష్మి పిరమిడ్ వ్యవస్థాపకులు బి సత్యనారాయణ మాస్టర్, పి ఎస్ ఎస్ ఎమ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ మాస్టర్ గారు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాస్టర్, వివిధ జిల్లాల నాయకులు, ప్రజలు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top