EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సంగారెడ్డి జిల్లా బిసి సంఘం మహిళా అధ్యక్షురాలుగా మంజుల ఈశ్వర్ గౌడ్

సంగా రెడ్డి సెప్టెంబర్ 14 (ఈతరం భారతం); సంగారెడ్డి జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా మంజుల ఈశ్వర్ గౌడ్- నియమితులైనారు. ఈమేరకు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య నియామక ఉత్తేర్వులు జారి చేసారు. ఈ కార్యక్రమానికి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం సత్యనారాయణ గౌడ్ మాట్లడుతుమంజుల ఈశ్వర్ గౌడ్ గారిని బీసీ మహిళల హక్కుల పక్షాన పోరాడాలని సంగారెడ్డి జిల్లా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం ఎంతో ఆనందదాయకమని ఇట్టి అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా బీసీ మహిళలు అందరూ సంఘటితమై జిల్లా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో బీసీ మహిళల యొక్క హక్కులను పొందేందుకు నిరంతరం పోరాడాలని పిలుపున్ ఇచ్చారు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ నాలుగు శాఖల వారు బీసీ మహిళలకు గౌరవమిచ్చి బీసీ మహిళల హక్కుల సాధనకై ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీ మహిళల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top