సంగారెడ్డి సెప్టెంబర్ 12 (ఈతరం భారతం); సంగారెడ్డి ప్రజలకు శుభ్రత, నాణ్యత తో కూడిన సరిపడా మంజీరా నీళ్ళు అదనంగా సరఫరా చేసేందుకు 200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయండని మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులకు టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు.అదనంగా కొత్త ఫిల్టర్ బెడ్, కొత్త ఇంటెక్ వెల్ నిర్మాణం చేయాలని అధికారులను కోరారు శుక్రవారం సంగారెడ్డి లో మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులటఃఈఓ సమీక్ష సమావేశం నిర్వఘించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలప్పుడు ఉదయం, సాయంత్రం అదనంగా రెండు గంటల పాటు మంజీరా నీళ్ళు ఇవ్వాలన్నారు….. సంగారెడ్డి మున్సిపాలిటీ లో ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ కు అదనంగా మరో ఫిల్టర్ బెడ్ , ఇంటెక్ వెల్ నిర్మించాల నీ ప్రతిపాదన ఉందని అవసరమైన చోట కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్స్, ట్యాంక్ ల నిర్మాణం చేపట్టాలని సూచించారు….. ఇరిగేషన్ అలకేశన్ అవసరం ఉందని …. హిందువులు, ముస్లిం లు, క్రిస్టియన్ ల పండుగ ల సందర్భం లో ఉదయం తో పాటు సాయంత్రం సమయం లో రెండు గంటల పాటు నీరు ఇచ్చేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించిచారు సంగారెడ్డి పట్టణ శివారు గ్రామాలైన కల్పగురు, కులబ్ గురు, తాల్లపల్లి , గంజి గూడెం , ఇరుగు పల్లి, కోత్లపూర్, ఫసల్ వాది తదితర గ్రామాల వరకు త్రాగు నీటి సరఫరా ఉండేలా డిజైన్ చేయాలన్నారు. రానున్న యాభై ఏళ్ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీ కి ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని, ఇరిగేషన్, RWS అధికారులతో కలిసి మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తెసుకున్తమన్నారు…. ఉమ్మడి రాష్ట్రం లో సంగారెడ్డి మున్సిపాలిటీ కి ప్రత్యేకంగా మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చాను…. రాష్ట్ర విభజన తర్వాత మంజీరా వాటర్ స్కీమ్ ను నాశనం చేశారు….. మంజీరా వాటర్ స్కీమ్ స్థానం లో మిషన్ భగీరథ ను తెచ్చి వాటర్ సరఫరా కు ఇబ్బందులు తెచ్చారు…… గతం లో ఉమ్మడి రాష్ట్రం లో మంజీరా స్కీమ్ ఇచ్చిన మాదిరిగా నీటి సరఫరా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంటూ అధికారులను అడిగి తెలుసుకున్న జగ్గారెడ్డి…. ఇప్పుడున్న రెండు మోటార్లు స్థానం లో మరో రెండు కొత్త మోటార్లు కావాల నీ కోరిన అధికారులు…. పండుగల రోజు ఉదయం, సాయంత్రం రెండు గంటలు మంజీరా నీరు రావాలని అధికారుల ను జగ్గారెడ్డి ఆదేశించేరు. మిషన్ భగీరథ పై ఆధారపడకుండా సరఫరా చేయాలన్న జగ్గారెడ్డి…. కొంత మేర మిషన్ భగీరథ పై ఆధారపడాల్సి వస్తుందని తెలిపిన అధికారులు…. ఉమ్మడి రాష్ట్రం లో మిషన్ భగీరథ కు సంబంధం లేకుండా మంజీరా నీరు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు అని కారణం ఏంటి? అధికారులను ప్రశ్నించారు. మంజీరా వాటర్ స్కీమ్ లో ఎందుకు అప్పుడు మార్పులు చేయాల్సి వచ్చిందని అధికారులను ఆరా తీసిన జగ్గారెడ్డి మిషన్ భగీరథ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా పాత మంజీరా వాటర్ స్కీమ్ మాదిరిగా నేరుగా సంగారెడ్డి మున్సిపాలిటీ కి మంజీరా నీళ్ళు సరఫరా చేయాలని, ఇది నా టార్గెట్ అని అధికారులకు తెలిపారు.రాజం పేట ఫిల్టర్ బెడ్, ఇంటెక్వెల్ పునరుద్దరణ కు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించగా ఫిల్టర్ మీడియా ను రీప్లేస్ చేసే అవసరం ఉందని అధికారులు తెలిపారు















