వరంగల్ సెప్టెంబర్ 22 (ఈతరం భారతం);అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్.1బి వీసాలపై కఠిన నిర్ణయం తీసుకోవడం, కంపెనీలపై $1 లక్ష (సుమారు రు.87 లక్షలు) భారాన్ని మోపడం, లేని పక్షంలో వీసా రద్దు చేస్తామని హెచ్చరించడం విడ్డూరం అని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తీవ్రంగా విమర్శించారు.ఈ తరహా నిర్ణయాలు భారతీయులపై తీవ్ర అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు.ప్రధాని నరేందర్ మోడీ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అమెరికా కంపెనీలను ఇండియాకు ఆహ్వానించాలన్నారు.ఆ కంపెనీలకు టాక్స్ మినహాయింపులు, ఫ్రీ స్థలాల కేటాయింపులు అందించాలన్నారు.ఈ నేపద్యం లో అమెజాన్ లాంటి కంపెనీలను ఇండియా ప్రజలు బహిష్కరించాలని రాజనాల పిలుపునిచ్చారు.“ఇలా చేస్తేనే డోనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారు” అని రాజనాల పేర్కొన్నారు.















