ఈతరం భారతం సెప్టెంబర్ 3 హన్మకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు రూ. 3.81 కోట్లకు పైగా విలువ చేసే 763.845 కిలోల గంజాయిని డ్రగ్ కంట్రోల్ టీమ్, ఖానాపురం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో సూర్యాపేట జిల్లాకు చెందిన భూక్య సాయికుమార్, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అందాల పాండు రెడ్డి, ఒడిశాకు చెందిన గుళ్లారి మునిరాజ్, కొప్పు కోటయ్య ఉన్నారు. వీరు ఒడిశా నుంచి గంజాయిని రవాణా చేస్తున్నారని, మజ్జి కృష్ణ ఆదేశాల మేరకు ఈ పని చేస్తున్నారని సీపీ తెలిపారు.















