ఈతరం భారతం వరంగల్ సెప్టెంబర్ 26 :హైదరాబాద్‌లోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలోవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న సుమారు 4,28,27,500/- రూపాయల విలువ గల 856.550 కిలోల ఎ గంజాయిని హనుమకొండ జిల్లా, అంమవారిపేటలోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్ వద్ద దగ్ధం (ఇన్సినరేషన్ పద్దతి) చేశారు.ఈ కార్యక్రమంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్ అంకిత్ కుమార్ సంక్వార్, ఐపీఎస్, డీసీపీ ఈస్ట్ జోన్, ఎన్.రవి, అదనపు డీసీపీ (అడ్మిన్), పి.డేవిడ్ రాజు, ఏసీపీ సీసీఆర్‌బీ, వరంగల్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.















