వరంగల్ సెప్టెంబర్ 24 (ఈతరం భారతం);బడా పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కేంద్రం అండదండలతో గాయత్రి ప్రాజెక్ట్ పేరుమీద 5700 కోట్లు ఋణం మాఫీ కేంద్రం చేసినట్లు వార్తలు వస్తున్నాయని, ఇట్టి రుణమాఫీ 5,700 కోట్లు సంక్షేమ పథకాలు వినియోగించాలని గ్రేటర్ కాంగ్రెస్ వరంగల్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేసారు. 2022 సంవత్సరంలో N C LT లో దివాలా పిటిషన్ వేసినారు 20400 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ చేసినారు కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో 8100 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ 880 కోట్లు IDPI బ్యాంకు 1015 కోట్లు బరోడా బ్యాంక్ 1382 కోట్లు కెనరా బ్యాంకు 1910 కోట్లు మొత్తముగా2400 కోట్ల రూపాయలు కట్టడానికి సుబ్బరాం రెడ్డి గారు ముందుకు వచ్చారు కానీ 5700 కోట్లు రుణమాఫీ చేసినట్లు సమాచారాన్ని వెంటనే విరమించుకోవాలని శ్రీ హరి డిమాండ్ చేసారు.















