ఈతరం భారతం సెప్టెంబర్ 29 :యాదాద్రి భువనగిరి : జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలలో ఈసారి సద్దుల బతుకమ్మకు చిన్నారుల బతుకమ్మలు ఎంతో ఆకర్షణీయంగా మారాయి.
చిన్నారులైన బాలికలు ప్రకృతి పూలతో ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆడే స్థలాలకు తీసుకువచ్చారు. సంప్రదాయ రీతిలో వస్త్రధారణతో బాలికలు ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలను ఆడారు. చిన్నారులు కళ్లెం తేజశ్రీ, శ్రీశ్వేత, వంగపల్లి నైనిక తదితర చిన్నారులు పాల్గొన్నారు.















