ఈతరంభరతం అక్టోబర్ 2 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక గాంధీ విగ్రహ వ్యవస్థాపకులు చింతకింది రామానుజం ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు బొమ్మ కంటి బాలరాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, నాయకులు ఐడియా శ్రీనివాస్, బీజని భాస్కర్, గాదే సోమిరెడ్డి, దూడల రాజశేఖర్ గౌడ్ సిరిగిరి సాగర్, మోతే తిరుపతి, మామిడాల నరసింహులు, కుమ్మరి సంఘం ప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.















