EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆలేరులో శిరీష స్మృత్యర్థం  ప్రజలకు అన్నదానం 

ఈ తరంభారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 1 :యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐవిఎఫ్ ధార్మిక కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, విజయలక్ష్మిల కూతురు కోడిత్యాల శిరీష 4 వ వర్ధంతి సోమవారం జరిగింది. స్థానిక మెయిన్ రోడ్డు వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి ప్రారంభించారు. చైర్మన్ చైతన్యతో పాటు పలువురు ప్రముఖులు శిరీష చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఐవిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ శ్రీధర్ గుప్త,ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు సముద్రాల కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం,నాగబండి జగదీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సముద్రాల రవి, మాజీ సర్పంచ్ లు ఆకవరం మోహన్ రావు, సందుల సురేష్, జూకంటి పౌల్,మీడియా ప్రతినిధులు జనం టివి శంకర్, ఎలగల కుమారస్వామి, సంపత్,బిజ్జాల విశ్వనాథం, తునికి జానకిరామ్, ఎండి ఖుర్షిద్ పాషా,వెంకటేష్,సిపిఎం పార్టీ నాయకులు కాయితి మహేందర్ రెడ్డి, ఎడ్ల కొండల్ రెడ్డి తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top