EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గుట్టలో ఘనంగా ఎరుకల తెగ విమోచన దినోత్సవం

యాదగిరిగుట్ట , సెప్టెంబర్ 1 (ఈతరం భారతం);: పుణ్యక్షేత్ర పట్టణమైన యాదగిరిగుట్టలో ఆదివారం ఎరుకల తెగ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానుపాటి కృష్ణ కుర్రు జెండా ( ఎరుకల జెండా ) ను ఆవిష్కరించారు. టిఎన్నో పోరాటాల ఫలితంగా నిర్బంధ సిటి క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ( సి టి యాక్ట్) చట్టాన్ని 1951 ఆగస్టు 31వ తేదీన భారత ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. అప్పటినుండి ఆగస్టు 31వ తేదీని విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఎరుకల తెగ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మానుపాటి కృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి గ్రామాల నుండి వచ్చిన ఎరుకల తెగ కులస్తులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులు మానుపాటి పరుశురాం, సముద్రం యాకయ్య, మండల మహిళా అధ్యక్షులు దేవరాయి మంజుల, మానుపాటి పెంటయ్య, మానుపాటి తోటరాజు, మానుపాటి వెంకటేశు, మానుపాటి చిన్న రాజు, మానుపాటి నడిపి రాజు, రుద్రాక్ష మహేష్, మానుపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top