ఈతరంభారతం సెప్టెంబర్ 26 యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సంతోషిమాత ఆస్థానంలో శ్రీ చంద్ర కళా నిలయం ఆధ్వర్యంలో గజ్జె పూజా మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నాట్యాన్ని అభ్యసిస్తున్న స్థానిక ఏకశిల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మూడవ తరగతి చదువుతున్న బేబీ కోటగిరి భవిష్యకు గజ్జె పూజ ధ్రువపత్ర సత్కారం జరిగింది. సంస్థ డైరెక్టర్ పెరుమాళ్ళ సంతోష్ తోపాటు మాజీ ఎంపీటీసీ కోటగిరి ఆంజనేయులు, సీనియర్ నాయకులు బండి నాగన్న, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరై భవిష్యకు శుభాకాంక్షలు తెలిపారు.















