యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25 (ఈతరం భారతం);: తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా.. సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకున్నారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం ఉదయం కొండ చుట్టూ ఆయన గిరిప్రదక్షిణ చేశారు. ఆయన వెంట గిరి ప్రదక్షిణలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే ,మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ , మాజీ డిసిసిబి చైర్మన్ ,టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు ఇన్చార్జి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కల్లూరి రాంచంద్రారెడ్డి, కసిరెడ్డి, ఫైళ్ల సత్యనారాయణ రెడ్డి, మధుసూదన రెడ్డి, సందిల్ల భాస్కర్ , ఇమ్మడి రామిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు గడ్డమీది రవీందర్ గౌడ్, తోటకూరి బీరయ్య, కసావు శ్రీనివాస్ , అంకం నరసింహ తదితర వేలాదిమంది పార్టీ శ్రేణులు తండోపతండాలుగా గిరి ప్రదక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపైకి వెళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని హరీష్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు హరీష్ రావు తో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు వేద ఆశీర్వచనం అందజేశారు.















