ఈతరం భారతం/యదాద్రి భువనగిరి /అక్టోబర్ 24:
బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ లో పనిచేసేవారు 25 మందికి నూతన వస్త్రాలు బహకరించడం జరిగింది. ఇది 20 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్న ప్రక్రియ పారిశుద్ధ కార్మికులను సమాజం తక్కువ చూపు చూస్తున్న సమయంలో మనం ఎంతో దగ్గరికి తీసి వాళ్లకు ధైర్యం చెప్పి వారు వార్డులలో పారిశుద్ధ్య పనులు చేస్తే మన యొక్క పరిసర ప్రాంతాలు నీటుగా ఉంటాయని, వారు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవలసిన బాధ్యత మన సమాజంపై ఉంటదని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమం రోటరీ క్లబ్, జననీ ఫౌండేషన్, మా యొక్క తల్లిదండ్రుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది పాల్గొన్న వారికి పేరుపేరునా ధన్యవాదాలు















