ఈతరంభారతం సెప్టెంబర్ 29 :యాదాద్రి భువనగిరి : పర్యావరణ ప్రాధాన్యతను చాటి చెప్పే గొప్ప ప్రకృతి పూల పండుగ బతుకమ్మ అని ప్రముఖ పురోహితులు ఎలగందుల ఉమారుషి అన్నారు. జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న శ్రీ కనకదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గౌరికి ప్రతిరూపంగా బతుకమ్మను మహిళలు కొలుస్తూ ఆమె ఆశీర్వాదాలను పొందే గొప్ప ఆధ్యాత్మిక సందర్భమే ఈ పండుగని తెలిపారు. కార్యక్రమంలో కనకదుర్గాదేవి ఆలయ ట్రస్ట్ చైర్మన్ కొలుపుల హరినాథ్, బతుకమ్మ పోటీల నిర్వాహకులు బేతి రాములు, పోటీల ఎంపిక జడ్జీలు చింతకింది మల్లయ్య, చింతకింది రామానుజం, పరిగెల రాములు, పురోహితులు శనిగల రవిశర్మ, స్థానికులు ఆడెపు బాలస్వామి, సముద్రాల కుమార్, నీలం వెంకటస్వామి, సిరిగిరి విద్యాసాగర్ పాల్గొన్నారు.















