ఈతరం భారతం సెప్టెంబర్ 29: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం మూల నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం నుండి గురువారం వరకు అనగా… మూల నక్షత్రం నుండి శ్రవణా నక్షత్రం వరకు త్రయాహ్నిక దీక్షాపూర్వకముగా ..శ్రీ పాంచరాత్ర ఆగమాను సారముగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో కలశస్ధాపన పూర్వక విశేష ఆరాధన, సహస్రనామ అర్చనలు చేస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకట చార్యులు తెలిపారు. తొలి రోజు సోమవారం విష్వక్సేన ఆరాధనతో ప్రారంభించారు .ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారి సన్నిధిలో…విశేషముగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తామని కూడాప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు తెలిపారు
.















