ఈతరం భారతం రామన్న పేట సెప్టెంబర్ 24 :వెల్లంకి గ్రామంలో డా.నకిరేకంటి అశోక్ తన ఇంటిలో వేర్పాటు చేసిన “బుద్ధ అంబేద్కర్ గ్రంథాలయము”నకు ఈరోజు విపంచి ఫౌండేషన్ సంస్థ వంద గ్రంథాలను సంస్థ గౌరవసలహాదారులు విశ్రాంత ఉపాధ్యాయులు అందోజు నాగభూషణము,విపంచి ఫౌండేషన్ చైర్మన్ గ్రామీణ గ్రంథాలయ ఉద్యమకారులు అనుముల శ్రీనివాస్ సంయుక్తంగా బహుకరించారు. “పుస్తక పఠనం పెంపొందించే లక్ష్యంతో తన స్వంత ఇంటిలో గ్రంథాలయం ఏర్పాటు చేసి సమాజానికి విజ్ఞానం అందించాలనే తపనతో డా.నకిరేకంటి అశోక్ పనిచేయడం అభినందనీయమని అందోజు నాగభూషణము అన్నారు.గ్రంథాలయాలు ఏర్పాటు చేసేవారికి విపంచి ఫౌండేషన్ సేకరించిన గ్రంథాలను బహుకరించి ప్రోత్సహిస్తుందని అనుముల శ్రీనివాస్ అన్నారు. పుస్తకాలు అందించి గ్రంథాలయాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న విపంచి ఫౌండేషన్ ద్వారా గ్రంథాలను అందుకోవడం నాకు మరింత ప్రోత్సాహం లభించిందని డా.నకిరేకంటి అశోక్ అన్నారు.ఈ కార్యక్రమంలో జ్యోతిష పరిశోధకులు కూరెళ్ళ నరసింహాచారి,వెలకుర్తి చంద్రశేఖర్, ప్రజాగాయకులు నకిరేకంటి సతీష్ పాల్గొన్నారు.















