ఈతరం భారతం ఆలేరు సెప్టెంబర్ 5 : యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు మండలం టంగుటూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఐదవ తరగతి విద్యార్థిని నేహర్ష తన చిత్రకళా ప్రతిభను చాటుకుంది. టియుడబ్ల్యూజె ( హెచ్- 143) జిల్లా అధ్యక్షులు జూకంటి అనిల్ కుమార్ తన జన్మ దినోత్సవ వేడుకలకు సంబంధించి విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేసేందుకురాగా అక్కడికక్కడే రంగుల బొమ్మ వేసి అదే కాగితంతో ఉంగరం చేసి హ్యాపీ బర్త్డే అని రాసి ఆయనకు నేహర్ష బహుకరించింది. ఆ చిన్నారి సృజనాత్మక ప్రతిభను అనిల్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు.















