EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదాద్రి జిల్లాలో వైభవంగా   సద్దుల బతుకమ్మ వేడుకలు 

ఈ తరంభారతం సెప్టెంబర్ 29 :యాదాద్రి భువనగిరి: జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గం లోనికి గ్రామాలలో , పట్టణాలలో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.

పలు కూడళ్లలో, దేవాలయాల ప్రాంగణాలలో, ఇండ్ల ముందర బతుకమ్మలను పెట్టి ఉయ్యాల పాటలు పాడుతూ మహిళలు ఆటలు ఆడారు. వివిధ ఎత్తులలో, ఆకర్షణీయమైన ప్రకృతి పూలతో ఈసారి అద్భుతమైన బతుకమ్మలు కనిపించి కనువిందు చేశాయి. ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయ రీతిలో జరిగిన బతుకమ్మ వేడుకలు మహిళల సంప్రదాయ, భక్తి తత్వాన్ని చాటి చెప్పాయి. బతుకమ్మలను ఆడిన అనంతరం నిమజ్జనోత్సవ కార్యక్రమాలను చెరువులు, కాలువలు, నీటి ఆవాసాలలో నిర్వహించారు. పెద్ద ఎత్తున వాయనాల పంపిణీ జరిగింది.

ఆలేరులో ప్రేమ సేవాసదనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు వాయినాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది.

జిల్లావ్యాప్తంగా పలు స్వచ్ఛంద, కార్మిక సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను నిర్వహించి మహిళలకు బహుమతులను అందజేశారు.

Related News

Select the Topic
Scroll to Top