EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వర్షం ధాటికి.. ఇళ్లలోనే బతుకమ్మల ఆటలు 

ఈ తరం భారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 21 :: కుండపోత వర్షం కురుస్తుండడంతో జిల్లాలో ఆదివారం రాత్రి తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకకు పలుచోట్ల అంతరాయాలు కలిగాయి.

ఆలయాలలో, ప్రధాన వీధులలో జరగవలసిన బతుకమ్మ వేడుకలు ఇండ్లలో జరిగాయి. మహిళలు తాము పేర్చిన బతుకమ్మలను ఇండ్ల ప్రాంగణాలలో పెట్టి ఆటలు ఆడారు. పలుచోట్ల రాత్రి 8 గంటల ప్రాంతంలో వర్షం కొంత ఆగడంతో బతుకమ్మలు తీసుకొని బయటకు వచ్చిన మహిళలు కలిసి ఆటలు ఆడి నిమజ్జనం జరిపి వాయినాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు.

Related News

Select the Topic
Scroll to Top