ఈ తరం భారతం యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 11 : జిల్లా పరిధిలోని ఆలేరు మండలం శారాజిపేట జడ్పీ హైస్కూల్లో హైదరాబాద్ కు చెందిన సిడి ఎఫ్ డి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్ పై అవగాహన, ముఖాముఖీ కార్యక్రమం జరిగింది. సి డి ఎఫ్ డి డైరెక్టర్ ప్రొఫెసర్ ఉల్లాస్ కొల్తూర్ సీతారాం మార్గనిర్దేశంలో సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, అధికారులు వీకే మిశ్రా, సిహెచ్ వి గౌడ్, బి ఏసుదాసు, ఎమ్మెస్ రావు, ఎం శ్రీనివాసులు, డాక్టర్ అమోఘ్ కులకర్ణి, ఎం.వి సుకన్య, ఎన్ పునిత, వి సంతోషదీపిక హాజరై విద్యార్థులకు వివిధ సైన్స్ సంబంధిత అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించి చూపి శాస్త్రీయ అవగాహనను కల్పించారు. నిత్యజీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, వాతావరణ మార్పులు, సైన్స్ తో సామాజిక పురోగతి, ఆరోగ్య సంరక్షణ, నోబెల్ బహుమతులు, డీఎన్ఏ, ఫింగర్ ప్రింట్ పరిశోధనలు, సైన్స్ తో ప్రపంచ అనుసంధానం తదితర అంశాలపై విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పించారు. అనంతరం తాము బోధించిన సైన్స్ అంశాలపై విద్యార్థి ముఖాముఖి, బృంద చర్చలను నిర్వహించారు. క్విజ్ ను నిర్వహించి విద్యార్థులలో శాస్త్రీయ అవగాహన సామర్ధ్యాన్ని నిర్ధారించి సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమం హైస్కూల్లో విద్యార్థులకు ఎంతో ఉపయోగపడిందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన సభ్యులు సముద్రాల కుమార్, బండి మహేందర్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రీయ అవగాహనను కల్పించిన శాస్త్రవేత్తలు, అధికారులను హై స్కూల్ తరపున సన్మానించారు..















